
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) దేశవ్యాప్తంగా కేంద్ర సర్వీసుల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సిలిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 16.
పోస్టుల సంఖ్య: 474.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 26.
లాస్ట్ డేట్: అక్టోబర్ 16.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.200.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈఎస్ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్: 2026, ఫిబ్రవరి 6.
పూర్తి వివరాలకు upsconline.nic.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ప్రిలిమ్స్: ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతారు. మొత్తం 500 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 500 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పేపర్–Iలో జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్ 200 ప్రశ్నలు 200 మార్కులకు, పేపర్–IIలో ఎంపిక చేసుకున్న ఇంజినీరింగ్ విభాగంలో నుంచి 300 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.
మెయిన్స్: మెయిన్స్‌లో సమాధానాలు డిస్క్రిప్టివ్ విధానంలో రాయాల్సి ఉంటుంది. మొత్తం 600 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పేపర్–-I, పేపర్–-I-Iల్లో ఎంపిక చేసుకున్న ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.
ఇంటర్వ్యూ: పర్సనల్ ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు కలిపి 1300 మార్కులకు ఉంటాయి.