పెట్రోల్, డీజిల్ బండ్ల తొలగింపు సాధ్యమే : మంత్రి నితిన్ గడ్కరీ

పెట్రోల్, డీజిల్ బండ్ల తొలగింపు సాధ్యమే : మంత్రి నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : భారత్‌‌ను గ్రీన్ ఎకానమీగా మార్చేందుకు పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా వదిలించుకోవడం ‘నూరు శాతం’ సాధ్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.  దేశంలోని 36 కోట్లకు పైగా పెట్రోల్,  డీజిల్ వాహనాలను తొలగిస్తామని అన్నారు. ఇంధన దిగుమతుల కోసం దేశం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.  

దిగుమతులను ఆపితే, ఈ డబ్బు రైతులు, గ్రామాల అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం వాడొచ్చని మంత్రి వివరించారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని ఐదుశాతానికి, ఫ్లెక్స్ ఇంజన్లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థికశాఖకు పంపామని గడ్కరీ వెల్లడించారు.