ఇండ్ల పట్టాలివ్వకుంటే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాం

ఇండ్ల పట్టాలివ్వకుంటే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాం

ఆసిఫాబాద్, వెలుగు: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఇండ్ల పట్టాలు ఇవ్వకుంటే జిల్లాలోని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇండ్లు నిర్మించుకుంటామని ప్రజా సంఘాల పోరాట ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు.  ప్రజా సంఘాల పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్  కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  జిల్లాలో అనేకమంది పేదలు ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

Also Read : బాసర ట్రిపుల్ ఐటీకి 1,404 మంది సెలెక్ట్

ప్రభుత్వం గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిందని నేటికీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు .  కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్, నాయకుడు ముంజం ఆనంద్ జాదవ్, రాజేందర్, కేవీపీఏస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డీవైఎఫ్ఐ నాయకుడు రాజ్ కుమార్, నిఖిల్ తిరుపతి శ్రావణి రాజేశ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.