బాసర ట్రిపుల్ ఐటీకి 1,404 మంది సెలెక్ట్

బాసర ట్రిపుల్ ఐటీకి 1,404  మంది సెలెక్ట్

బాసర, వెలుగు :  నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీయూలో  2023- – 2024 విద్యా సంవత్సరానికి  పీయూసీ ఫస్ట్ ఇయర్ కు ఎంపికైన విద్యార్థుల జాబితాను సోమవారం ఇన్​ చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్​ కుమార్ విడుదల చేశారు. 

1604 సీట్లకు మొత్తం13,538  దరఖాస్తులు వచ్చాయి. వీరిలో1,404  మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో బాలికలు 67  శాతం సీట్లకు, బాలుర 33శాతం సీట్లకు ఎంపికవగా.. మొత్తంగా 99శాతం సీట్లను  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పొందారు. అధికంగా సిద్దిపేట జిల్లాకు  322 సీట్లు, తక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాకు 2 సీట్లు దక్కాయి. ఎంపికైన విద్యార్థులకు 7,8,9 తేదీల్లో ప్రతిరోజు 500 మంది విద్యార్థుల చొప్పున  కౌన్సెలింగ్  నిర్వహిస్తారు.