V6 News

PEDDI: ‘పెద్ది’ స్పీడు అదిరింది బుచ్చి.. ఓ వైపు షూటింగ్‌‌‌‌, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌

PEDDI: ‘పెద్ది’ స్పీడు అదిరింది బుచ్చి.. ఓ వైపు షూటింగ్‌‌‌‌, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌

రామ్ చరణ్‌‌‌‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మార్చి 27న చరణ్‌‌‌‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్‌‌‌‌ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన మేకర్స్‌‌‌‌.. అందుకు తగ్గట్టుగా జనవరి నెలాఖరు వరకు టాకీ పార్ట్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

శుక్రవారం (Dec 12) నుంచి హైదరాబాద్‌‌‌‌లో కొత్త షెడ్యూల్‌‌‌‌ మొదలవుతోంది. ఇందులో రామ్ చరణ్‌‌‌‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరిస్తారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ వైపు షూటింగ్‌‌‌‌ను పరుగులు పెట్టిస్తూనే.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ పనులను జెట్‌‌‌‌ స్పీడ్‌‌‌‌తో పూర్తి చేస్తున్నాడు.

రామ్ చరణ్‌‌‌‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌, ‘చికిరి చికిరి’ పాటకు హ్యూజ్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది. ఎ.ఆర్‌‌‌‌‌‌‌‌.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.