మానవాభివృద్ధిలో భారత్ ర్యాంకు 132

మానవాభివృద్ధిలో భారత్ ర్యాంకు 132
  • కరోనా మహమ్మారే కారణమన్న యూఎన్డీపీ రిపోర్ట్
  • తగ్గిన సగటు జీవితకాలం

యునైటెడ్​ నేషన్స్: కరోనా సృష్టించిన విలయం కారణంగా ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధి ఐదేండ్లు వెనక్కి వెళ్లిపోయిందని యునైటెడ్​ నేషన్స్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రాం(యూఎన్డీపీ) వెల్లడించింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. యూఎన్డీపీ ఏర్పాటైన 30 ఏండ్లలో మానవాభివృద్ధి సూచీ వరుసగా రెండేండ్లు తగ్గుదల నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. 2020లో మానవాభివృద్ధి రేటులో తగ్గుదల నమోదు కాగా, 2021లోనూ అదే పరిస్థితి కనిపించింది. జీవిత కాలం పెరుగుదల, విద్య, జీవన ప్రమాణాల స్థాయి తదితర అంశాల్లో సాధించిన ప్రగతి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గత కొన్ని దశాబ్దాలుగా మానవాభివృద్ధి సూచీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020లో కరోనా వచ్చిన నుంచి తగ్గుతూ వచ్చి 2021లోనూ అది కొనసాగింది. దీంతో ఐదేండ్ల కింద సాధించిన అభివృద్ధి కూడా హరించుకుపోయిందని ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఏ ఒక్క దేశానికో ఈ పరిస్థితి పరిమితం కాలేదని, ప్రపంచంలోని 90 శాతం దేశాలు దీనిబారిన పడ్డాయని ఈ స్టడీ వెల్లడించింది. 

చదువు, ఆదాయం తగ్గిపోయింది
ఇప్పుడు మనం త్వరగా చనిపోతున్నామని, తక్కువ చదువుతున్నామని, ఆదాయాలూ తగ్గుతున్నాయని యూఎన్డీపీ చీఫ్ అచిమ్ స్టైనర్ చెప్పారు. సగటు జీవితం కాలం గ్లోబల్​గా 2019లో 73 ఏండ్లు ఉంటే.. 2021 నాటికి అది 71.4 సంవత్సరాలకు పడిపోయింది. మామూలు దేశాలే కాదు.. అమెరికాలో కూడా సగటు జీవిత కాలం రెండేండ్ల వరకు తగ్గిందని వెల్లడించారు.

మన దేశానికి 132వ ర్యాంకు
మానవాభివృద్ధి సూచీలో మొత్తం 191 దేశాలకుగాను మన దేశానికి 132వ ర్యాంకు దక్కింది. గతేడాది 189 దేశాల్లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఏడాది 130వ స్థానంలో ఉంది. మీడియం హ్యూమన్​ డెవలతతతతప్​మెంట్​ కేటగిరిలో 2020లో హెచ్​డీఐ వాల్యూ 0.645 ఉంటే.. 2021లో అది 0.633కి పరిమితమైంది. మనదేశంలో సగటు జీవిత కాలం 69.7 ఏండ్ల నుంచి 67.2 ఏండ్లకు తగ్గింది. ఈ ఏడాది మానవాభివృద్ధి సూచీలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్​లాండ్​ టాప్​లో ఉంటే.. సౌత్​ సూడాన్, ఛాడ్, నైగర్​ చివరి ప్లేస్​లో నిలిచాయి.