అమెరికాలో కరోనా మరణాలు 10 వేలు దాటాయి. సోమవారం ఒక్క రోజు 756 మంది చనిపోగా, ఒక్క న్యూయార్క్ లోనే 599 మంది వైరస్ కు బలయ్యారు. మొత్తం చనిపోయినోళ్ల సంఖ్య 10,372 మంది కన్ను మూశారు. 15,576 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం బాధితుల సంఖ్య 3,52,249కి పెరిగింది. న్యూయార్క్ లో కరోనాకు 1,30,689 మంది బాధితులవగా, 4,758 మంది చనిపోయారు. అమెరికాలోని 33 కోట్ల జనాభాలో 95 శాతం మందిని ప్రభుత్వం ఇంటికే పరిమితం చేసింది. ఇళ్లు, వాకిలి లేనివారిని ఆదుకోవాలంటూ అన్ని రా ష్ట్రాల గవర్నర్లను కోరామని సర్జన్ జనరల్ జెరొమి ఆడమ్స్ చెప్పారు. మరోవైపు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు ప్రెసిడెంట్ ట్రంప్ 42 రాష్ట్రాల్లో మేజర్ డిజాస్ట ర్ డిక్లరేషన్ నోటిఫై చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా పై పోరులో 50 వేల మంది సైనికులు, వెయ్యి మంది ఆర్మీ డాక్టర్లు, నర్సు ల సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారు 30 ఆస్పత్రులు కడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 16 లక్షల మందికి కరోనా టెస్టులు చేశామని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అవ సరమైన మందులు అమెరికాకు అందుతున్నాయని తెలిపారు. న్యూయార్క్ తో పాటు కొన్ని వైరస్ హాట్ స్పాట్లలో కొత్తకేసుల నమోదు తగ్గడం శుభ సూచికమని ట్రంప్ అన్నారు.
దేశ చరిత్రలో అత్యంత కష్టకాలం
‘అమెరికా చరిత్రలోనే అత్యంత కష్టకాలం ఇదే.. షెర్ల్ హార్బర్ పై జపాన్ దాడి, ట్విన్ టవర్స్ పై టెర్రర్ అటాక్లకు మించిన ట్రాజెడీ ఇది. ఇప్పటి దాకా ఎదురైన పరిస్థితులు ఒకెత్తు, ఈ వారం నుంచి మరొక ఎత్తు. ముందున్నది ఇంకా కష్టకాలమే’ అని జెరొమి ఆడమ్స్ చెప్పారు. ఈ వారం రోజులు చాలా మంది అమెరికన్ల జీవితాల్లో అత్యంత కష్టమైన కాలమని ఆయన అన్నారు. కరోనాను తట్టుకు ని నిలబడాలంటే ప్రతీ పౌరుడూ ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకుని, తన బాధ్యత విధిగా నిర్వహించాలని చెప్పారు. కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్న క్రమంలో లూసియానాలోని న్యూ ఆర్లాన్స్ కన్వె న్ష న్ సెంటర్ను టెంపరరీ హాస్పిటల్ గా మార్చారు.
మందుల టెస్టింకు ముందుకొస్తున్నరు
కరోనా ట్రీట్మెంట్ కోసం తయారుచేసిన రెండి సివ ర్ మందు పరీక్షకు బాధితులు వాలంటరీగా ముందుకొస్తున్నరని డాక్టర్లు చెప్పారు. మెడిసిన్ను 440 మంది పేషెంట్లపై మందును పరీక్షించాల్సి ఉండగా.. ఈ సంఖ్య ఇప్పటికే దాటేసినట్లురెండిసి విర్ మెడిసిన్ తయారుచేసిన గిలీడ్ సైన్సెస్ కంపెనీ ప్రకటించింది. ఆదుకొమ్మన్నందుకు ఊడబీకారు.. వైరస్ బారిన పడ్డ తన సిబ్బందిని ఆదుకోవాలంటూ విజ్ఞ ప్తిచేస్తూబహిరంగ లేఖ రాసిన కెప్టెన్ బ్రెట్ క్రోజి యెర్ను నేవీ డిస్మిస్ చేసింది. పై అధికారులకురాసిన లెటర్ను మీడియాకు లీక్ చేయడమే దీనికి కారణ మని తెలుస్తోంది. పరీక్షల్లో బ్రెట్ కు కూడా కరోనా సో కినట్లు తేలిం ది. వైరస్ పేషెంట్లకు మలేరియా మందు హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకంపై వైట్ హౌస్ లో పెద్ద ఎత్తున డిబేట్ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.
