T20 World Cup 2024:సూపర్ 8 సమరం.. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన అమెరికా

T20 World Cup 2024:సూపర్ 8 సమరం.. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన అమెరికా

వరల్డ్ కప్ లో సూపర్ 8 కు పోరు మొదలు కానుంది. ఇప్పటి నుంచి జట్లన్నిటికీ అసలు పరీక్ష మొదలు కానుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ లో అమెరికాతో సౌతాఫ్రికా తలపడనుంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో అమెరికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆడిన 4 మ్యాచ్ ల్లో గెలిచి గ్రూప్ డి లో టాప్ స్థానంలో ఉంటే.. అమెరికా 5 పాయింట్లతో గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. బార్ట్ మెన్ స్థానంలో కేశవ్ మహారాజ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు స్పిన్నర్ నోస్తుష్ కెంజిగే అమెరికా ప్లేయింగ్ 11 చోటు దక్కించుకున్నాడు.        

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

యునైటెడ్ స్టేట్స్ (ప్లేయింగ్ XI): 

షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్ ), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్