ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో సమైక్యతా సంబరాలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో సమైక్యతా సంబరాలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో శుక్రవారం సమైక్యతా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా, నియోజకవర్గాల కేంద్రాల్లో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. నిర్మల్​లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, కలెక్టర్​ ముషారఫ్​అలీ ఫారూఖీ, ఖానాపూర్​లో ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్  డ్యాన్స్​చేసి ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి మాట్లాడారు. తెలంగాణ విమోచన చరిత్రను వక్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను నమ్మొద్దన్నారు. సమష్టి పోరాటాల  కారణంగా అప్పటి  నిజాంరాజు హైదరాబాద్  సంస్థానాన్ని  భారత యూనియన్ లో విలీనం చేశారన్నారు. కొంతమంది సెప్టెంబర్ 17 పై కుట్రలు చేస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం  చారిత్రాత్మక నిర్ణయమన్నారు. పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి డిమాండ్ ​చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్  విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ ,ఎస్పీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ తదితరులు పాల్గొన్నారు.

  • ఆదిలాబాద్​ ఇందిర ప్రియదర్శిని స్టేడియం, బోథ్​లో​జరిగిన వేడుకల్లో కలెక్టర్​ సిక్తా పట్నాయక్​, ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి, జడ్పీ చైర్మన్ రాథోడ్​ జనార్దన్​, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్​ బాపూరావు, డీసీసబీ చైర్మన్​అడ్డి భోజారెడ్డి, అడిషనల్​కలెక్టర్లు నటరాజ్, రిజ్వాన్​బాషా షేక్​, డీఆర్​డీవో కిషన్ పాల్గొన్నారు.
  • ఆసిఫాబాద్​లో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్​రాహుల్​రాజ్, అడిషనల్​కలెక్టర్​రాజేశం, ఎస్పీ సురేశ్​కుమార్, జడ్పీ చైర్​పర్సన్​కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు డీఆర్వో సురేశ్, డీఎస్పీ శ్రీనివాస్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్​రావు పాల్గొన్నారు.
  • మంచిర్యాలలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్​రావు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. చెన్నూరులో జరిగిన వేడుకల్లో కలెక్టర్​భారతీ హోళికెరి పాల్గొన్నారు. 
  • ఖానాపూర్​లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రేఖానాయక్, అడిషనల్​కలెక్టర్​హేమాంత్ బోర్కడే , మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ , ఏంసీ మాజీ చైర్మన్ శంకర్ , ఎంపీపీ మొహిద్ తదితరులు పాల్గొన్నారు.
  • కాగజ్​నగర్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్​, డీఆర్​డీవో సురేందర్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ , కమిషనర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
  • బెల్లంపల్లిలో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ సీఈవో నరేందర్, డీఆర్వో శేషాద్రి, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, ఆర్డీవో శ్యామలాదేవి, జడ్పీ వైస్  చైర్మన్ సత్యనారాయణ, ఏసీపీ ఎడ్ల మహేశ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్​ పాల్గొన్నారు.

- ఆదిలాబాద్/నిర్మల్/మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు