సిలబస్ లో మార్పులు: దీపావళి తర్వాత యూనివర్సిటీలు రీఓపెన్

సిలబస్ లో మార్పులు: దీపావళి తర్వాత యూనివర్సిటీలు రీఓపెన్

హైదరాబాద్: కరోనా క్రమంలో సెలవులు ప్రకటించిన యూనివర్సిటీలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీపావళి తర్వాత రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పునఃప్రారంభిస్తామని బుధవారం తెలిపారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి.  డిసెంబర్ నుంచి హైస్కూల్స్, ఇంటర్మీడియట్ వారికి ఫిజికల్ క్లాసులు ఉండొచ్చన్నారు. డిగ్రీ విద్యార్థులకు 30 శాతం సిలబస్ తగ్గిస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా సిలబస్ తగ్గించాలనుకుంటున్నామన్నారు. మార్చిలో టెన్త్ పరీక్షలు, ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఉండే అవకాశం ఉందని.. ఇంజినీరింగ్ సీట్లు మిగిలితే మళ్లీ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసులు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు పాపిరెడ్డి.