నయా రికార్డ్.. క్లాస్‌మేట్లే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు

నయా రికార్డ్.. క్లాస్‌మేట్లే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు

నలుగురు ఫ్రెండ్స్.. లా కాలేజీలో స్టూడెంట్స్… ఒకే బేంచ్.. అదికూడా ఫ్రంట్ రో..  ఆ నలుగురు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. వారిలో ఇది వరకే ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులుగా పని చేస్తుండగా మరో ఇద్దరు ఈ నెల 19వ తారీకున.. సుప్రీం కోర్టుకు జడ్జీలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇదొక రికార్డ్.

ఆ నలుగురు…  ఎస్‌ఆర్‌ భట్‌, జస్టిస్‌ హృతికేశ్‌రాయ్‌లు, డీవై చండ్రచూడ్‌, ఎస్‌కే కౌల్‌లు.  వీరిలో  జస్టిస్‌ ఎస్‌ఆర్‌ భట్, జస్టిస్‌ హృతికేశ్‌రాయ్‌లు ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమితులవగా…  ఎస్‌కే కౌల్, చండ్రచూడ్ ముందుగానే సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. ఒకే తరగతికి చెందిన నలుగురు క్లాస్‌మేట్స్ ఇలా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కావడం మొదటిసారి. వీరందరూ ఢిల్లీ యునివర్సిటీలో 1982లో లా పట్టా తీసుకున్నారు.