
జనగామ, వెలుగు : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. స్థానికులు, చైల్డ్వెల్ఫేర్ అధికారుల కథనం ప్రకారం.. తెల్లవారుజామున గ్రామంలో పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు నిద్ర లేచి చూడగా రోడ్డుపై మగ శిశువు కనిపించింది. అక్కున చేర్చుకున్న స్థానికులు చుట్టుపక్కల ఆరాతీశారు. ఫలితం లభించకపోవడంతో రఘునాథపల్లి పోలీసులకు, చైల్డ్ హైల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు.
సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్ చైల్డ్ప్రొటెక్షన్యూనిట్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును రఘనాథపల్లి పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్సలు చేయించారు. మెరుగైన చికిత్స కోసం జనగామ శివారు ఎంసీహెచ్‌లో అడ్మిట్‌చేశారు. ఆస్పత్రి సూపరెంటెండెంట్డాక్టర్ మధుసూదన్ ట్రీట్ మెంట్ఇవ్వగా, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.