ఆగస్టు 1 నుంచి అన్‌లాక్‌ 3.0.. థియేటర్‌‌లు, జిమ్‌లు‌ తెరిచే చాన్స్‌?

ఆగస్టు 1 నుంచి అన్‌లాక్‌ 3.0.. థియేటర్‌‌లు, జిమ్‌లు‌ తెరిచే చాన్స్‌?

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ను అన్‌లాక్‌తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో అన్‌లాక్ 2.0 ముగిసిపోనుంది. ఇప్పుడు ప్రభుత్వం అన్‌లాక్ 3.0 పేరుతో కొత్త గైడ్‌లైన్స్‌ను వచ్చే నెలలో అమలు చేయనుందని సమాచారం. ఈ అన్‌లాక్‌లో మరిన్ని సడలింపులపై సర్కార్ పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ సడలింపుల్లో కొన్ని ఎస్‌ఓపీ, సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటిస్తూ ఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్స్‌ను రీఓపెన్ చేయడం కూడా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సినిమా థియేటర్స్‌ను తిరిగి తెరవాలని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపోజల్‌పై సినిమా థియేటర్స్‌ ఓనర్స్‌ను ఐబీ మినిస్ట్రీ ముందే సంప్రదించింది.

మూడో ఫేజ్‌లో జిమ్‌లను కూడా తిరిగి తెరుస్తారని తెలిసింది. అన్‌లాక్‌ 3.0లో కూడా కొన్ని నిబంధనలను కొనసాగిస్తారని సమాచారం. అయితే స్కూళ్లు, మెట్రో రైళ్ల సర్వీసులు మాత్రం మూసేసి ఉండనున్నాయి. స్కూళ్ల రీఓపెన్‌పై రాష్ట్రాలతో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (హెచ్‌ఆర్‌‌డీ) చర్చలను ప్రారంభించిందని సెక్రటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనితా కర్వాల్ తెలిపారు. ఈ విషయంపై పేరెంట్స్‌ నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటామని హెచ్‌ఆర్‌‌డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.