అన్ లాక్… సోషల్ ఫోబియా

అన్ లాక్… సోషల్ ఫోబియా

నలుగురిలో కలవాలంటే భయపడుతున్నరు

నెలల తరబడి సోషల్ లైఫ్ కి దూరం

 సైకాలజిస్ట్ లను కన్సల్ట్​  అవుతున్న సిటిజన్స్

పెరుగుతున్న యాంగ్జైటీ కేసులు

ఆన్ లైన్ లో కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తో ఆర్నెళ్ల నుంచి ఇంటికి పరిమితమైన జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. అన్ లాక్–4 స్టార్ట్ అవబోతున్నా చాలామంది ఇంటి పట్టునే ఉంటున్నారు. కరోనా భయంతో ఒకప్పటిలా బయటకు తిరగాలన్నా, నలుగురిలో కలవాలన్నా జంకుతున్నారు. ఇప్పటికే సిటీ మార్కెట్ లో మామూలు పరిస్థితులు ఏర్పడుతున్నా, సోషల్ ఫోబియాతో  బాధపడుతున్నారని సైకాలజిస్ట్ లు చెప్తున్నారు. వైరస్ భయం, యాంగ్జైటీతో అనేకమంది తమను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. అలాంటి వారికి సెషన్స్ ద్వారా మూడు నెలలు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

వైరస్ ఫీవర్..

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో మార్చి 22న లాక్ డౌన్ మొదలైంది. దాంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకి రాని పరిస్థితి ఏర్పడింది. ఏది కావాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవడం, ఎవరితో మాట్లా డాలన్నా వీడియో కాల్స్, డిజిటల్ గా కమ్యూనికేట్ అవడం అలవాటు చేసుకున్నారు. సింప్టమ్స్ తో సంబంధం లేకుండా పాజిటివ్ వస్తుండటంతో ఈ భయం ఇంకా పెరిగింది. దాంతో ఇంట్లో నే ఉంటూ సేఫ్టీ ప్రికాషన్స్, హెల్దీ డైట్ తీసుకుంటున్నారు. మంగళవారం నుంచి అన్ లాక్–4 మొదలవుతున్నా వైరస్ టెన్షన్ వీడడం లేదు.

ఒకే చోట ఉండడంతో..

నెలల తరబడి ఒకేచోట ఉండటంతో మానసిక ఆందోళన, ఒత్తిడి, కరోనా ఫియర్ తో సైకాలజిస్టులను అనేక మంది కన్సల్ట్ అవుతున్నా రు. యాంగ్జైటీ, వైరస్ భయంతో సతమతమవుతున్న వారు ఎక్కువగా వస్తున్నట్లు సైకాలజిస్ట్ లు చెప్తున్నారు. యూత్ లో ఈ ఫియర్ లెవల్స్ తక్కువగా ఉన్నా, 32 –45 ఏండ్ల వారిలో ఎక్కువ ఉన్నట్లు తెలిపా రు. అలాంటి 7 నుంచి 8 సెషన్స్ ద్వారా కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఓసీడీ (ఒబ్సెస్సి వ్ కంపల్సివ్ డిజార్డర్) ఉన్నవారిలో ఈ సోషల్ ఫోబియా పోవడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు.

బయటకి వచ్చినా అన్ కంఫర్ట్ గా ఫీల్..

వ్యాక్సిన్ వచ్చే వరకు జనాల్లో వైరస్ భయం ఉంటుంది. మొత్తంగా అన్ లాక్ ప్రకటించినా సోషల్ గా మింగిల్ అవ్వాలంటే అన్ కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. దీన్నే సోషల్ ఫోబియా అంటారు. మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బయటకు వచ్చినా అసౌకర్యంగా , అభద్రతా భావంతో ఉంటారు. నా దగ్గరికి ఇలాంటివి 20 కేసులు వచ్చాయి. క్లైంట్స్ కి జూమ్ ద్వారా సెషన్స్ కండెక్ట్ చేస్తున్నా. వాట్సాప్ ద్వారా టెలీ కౌన్సెలింగ్ ఇస్తున్నా. – డా. సంగీతా కొసురు, సైకాలజిస్ట్.