నెంబర్ ప్లేట్స్ లేకుంటే బండ్లు సీజ్.. జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

నెంబర్ ప్లేట్స్ లేకుంటే బండ్లు సీజ్.. జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్న వాహనదారులకు జగిత్యాల జిల్లా ట్రాఫిక్ పోలీసులు ఝలకిచ్చారు. శుక్రవారం (జులై 04) జట్టణంలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న పట్టుకున్నారు.  నెంబర్ ప్లేట్స్ తీసివేసిన, విరగొట్టిన, నెంబర్ ప్లేట్స్ కనిపించకుండా స్టిక్కర్స్  అతికించిన సుమారు 50 కి పైగా  వాహనాలను పట్టుకున్నారు.

ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో.. నెంబర్ ప్లేట్స్ లేని బైక్ లకు జరిమానా విధించారు. వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి, రోడ్డు భద్రత  నియమాలపై అవగాహన కల్పించారు  సిఐ కరుణాకర్. వాహనాలకు  నెంబర్ ప్లేట్స్ బిగించి పంపించారు ట్రాఫిక్ పోలీసులు.

ALSO READ : అర్థరాత్రి వైన్స్లో చోరీ.. దొరికిన కాడికి దోచుకెళ్లారు

 

ఈ సందర్భంగా వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని, నెంబర్ ప్లేట్స్ తీసివేసినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు.