
ఈ మధ్య దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇండ్లు, నగల షాపులు, ఏటీఎంలు, బ్యాంకులు ఇలా దేనిని వదలడం లేదు. దొరికిన కాడికి దోచుకెళ్తున్నారు. లేటెస్ట్ గా వరంగల్ లోని ఓ వైన్ షాపులో దొంగలు అందిన కాడికి చోరీకి పాల్పడ్డారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లులోని రాజన్న వైన్స్ షాపులో గురువారం అర్థరాత్రి ( జూలై 3, 2025 ) అర్థరాత్రి చోరీ జరిగింది. నలుగురు సభ్యుల ముఠా వైన్ షాపు కౌంటర్లో డబ్బులతో పాటు బీర్లు కూడా పట్టుకెళ్లారు కేటుగాళ్లు. వైన్ షాపుకు ఉన్న తాళాలు కట్ చేసి లోపలికి దూరిన దొంగలు కౌంటర్లో ని నగదు, 33 వేల విలువ చేసే మద్యంను ఎత్తుకెళ్లారు.
►ALSO READ | శాంతినగర్ లో పట్టపగలే గోల్డ్ షాప్ లో చోరీ
రాత్రి షాపు మూసే సమయానికి లెక్కలు చూసి తాళాలు వేసి వెళ్ళిపోయామని...మళ్ళీ ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని తెలిపారు సిబ్బంది. దొంగల కదలికలన్ని సిసి కెమారాల్లో రికార్డయ్యాయి. వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సిసి ఫుటేజ్ ఆధారంగా, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.