Diogo Jota: విషాద మరణానికి అతి పెద్ద గౌరవం.. 148 సంవత్సరాల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన వింబుల్డన్

Diogo Jota: విషాద మరణానికి అతి పెద్ద గౌరవం.. 148 సంవత్సరాల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన వింబుల్డన్

లివర్‌పూల్ స్టార్, పోర్చుగీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్ డియోగో జోటా (28) గురువారం (జూలై 3) కారు ప్రమాదంలో మరణించడం ప్రపంచ క్రీడా చరిత్రలో విషాదకర రోజుగా మిగిలింది. స్పెయిన్‌లోని జమోరా నగరంలో జరిగిన ఈ ప్రమాదంలో అర్ధరాత్రి 12:40 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది.  విషాదకరమైన విషయం ఏంటంటే డియోగో జోటా కొద్దీ రోజుల క్రితమే తన చిన్ననాటి స్నేహితురాలు రూట్ కార్డోసోను పెళ్లి చేసుకున్నాడు. డియోగో జోటా విషాద మరణానికి వింబుల్డన్ నిర్వాహకులు  అతి పెద్ద గౌరవాన్ని ఇవ్వనున్నారు. 

వింబుల్డన్ 148 సంవత్సరాల సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ శుక్రవారం (జూలై 4) జోటా మరణానికి నివాళులు అర్పిస్తూ  ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్‌లు లేదా రిబ్బన్‌లను ధరించడాలని కోరింది. వింబుల్డన్ సంప్రదాయం ప్రకారం ఈ మెగా టోర్నీకి ప్లేయర్లు అందరూ వైట్స్ లోనే కనిపించాలి. డ్రెస్ కోడ్, షూస్, స్కార్ఫ్, ఇలా ఆటగాళ్లు ఆడే వస్తువులన్నీ వైట్ కలర్ లోనే ఉండాలనే రూల్ ఉంది. అయితే ఫుట్ బాల్ ప్లేయర్ డియోగో జోటా కోసం టోర్నమెంట్ చరిత్రలో తొలిసారి రూల్స్ మార్చడానికి సిద్ధమైంది. 

పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ధృవీకరణ: ప్రమాదం గురించి వార్తలు వచ్చిన వెంటనే పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ డియోగో జోటా మరణాన్ని ధృవీకరించింది. ఫెడరేషన్ అధ్యక్షుడు పెడ్రో ప్రోయెంకా మాట్లాడుతూ, డియోగో  జోటాతో పాటు అతని సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా మరణించారని తెలిపారు.

"స్పెయిన్‌లో డియోగో జోటా అలాగే ఆండ్రీ సిల్వా మరణాలతో పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సహా మొత్తం పోర్చుగీస్ ఫుట్‌బాల్ నాశనమైంది. జాతీయ జట్టుకు దాదాపు 50 అంతర్జాతీయ మ్యాచ్‌లతో అద్భుతమైన ఆటగాడి కంటే డియోగో జోటా  చాలా ఎక్కువ.  డియోగో జోటా ఒక అసాధారణ వ్యక్తి. అతని టీంమేట్స్,  ఇతర ప్లేయర్లు కూడా ఎంతో గౌరవించే వ్యక్తి" అని పెడ్రో ప్రోయెంకా తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tennis (@underarmserve)