జైళ్లో తుపాకీ, మందు, విందుతో ఖైదీల హల్చల్

జైళ్లో తుపాకీ, మందు, విందుతో ఖైదీల హల్చల్

ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జైళ్లో.. తుపాకీ, మందు, విందుతో హల్చల్ చేశారు ఖైదీలు. దేశీయంగా తయారు చేసిన ఓ తుపాకీతో ఫోజులిచ్చారు. తర్వాత మందు, బిర్యానీతో పార్టీ చేసుకున్నారు. అయితే.. ఈ వీడియో బయటకు రావడంతో.. యూపీ పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై స్పందించిన అధికారులు.. కొందరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయితే.. జైళ్లో ఖైదీల దగ్గర తుపాకీ ఉండటంపై యూపీ హోంశాఖ రియాక్ట్ అయ్యింది. అది మట్టితో తయారుచేసిన తుపాకీ అని క్లారిటీ ఇచ్చింది. ఓ ఖైదీ మంచి పెయింటర్ అని.. ఒరిజినల్ తుపాకీలాగా పెయింటింగ్ చేశాడని చెప్పుకొచ్చింది.