మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు అపూర్వ స్పందన : అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి

మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు అపూర్వ స్పందన : అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి
  •     అల్ఫోర్స్​ చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి

కొత్తపల్లి, వెలుగు: గణితంతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని అల్ఫోర్స్ చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి అన్నారు. కరీంనగర్​ పట్టణంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్-- 2025కు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. 

తొలుత శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ దేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త అని కొనియాడారు. ఏటా తెలంగాణవ్యాప్తంగా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒలింపియాడ్​ టెస్ట్​ నిర్వహిస్తున్నామన్నారు. 

ఆదివారం నిర్వహించిన పరీక్షకు 18,450 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఈ పరీక్షలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలను ఈ నెల 22న కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో స్కూల్​లో అందజేస్తామన్నారు.