జన్నారం మండలంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం

జన్నారం మండలంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం

జన్నారం, వెలుగు: జన్నారం మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసింది. మూడ్రోజుల నుంచే మబ్బులు వస్తుండటంతో  రైతులు ముందు జాగ్రత్తగా కవర్లు సిద్ధం చేసుకొని వరి కుప్పలపై కప్పడంతో భారీ నష్టం తప్పింది. అక్కడక్కడ కొన్ని సెంటర్లలో మాత్రమే స్వల్పంగా ధాన్యం తడిసింది.

ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలి 

వరి ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేసి వెంటనే రవాణా చేయాలని జన్నారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు సోమవారం తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండటం వల్ల అకాల వర్షాలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి, మండల రైతులు పాల్గొన్నారు.