నగలు కొంటామని మాటల్లో పెట్టి.. తుపాకీతో బెదిరింపు

నగలు కొంటామని మాటల్లో పెట్టి..  తుపాకీతో బెదిరింపు

రంగారెడ్డి జిల్లా: నగలు కొంటామని మాటల్లో పెట్టి తుపాకీతో బెదిరించి చోరీకి విఫలయత్నం చేసిన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో చోటు చేసుకుంది. గన్ తో బెదిరించిన దుండగులను గుర్తించి అరుపులు కేకలు వేయడంతో.. దుండగులు పారిపోయేందుకు యత్నించారు. వారిలో ఇద్దరు పట్టుపడ్డారు. 

మధుబన్ కాలనీలోని సరస్వతి జువెల్లర్స్ కు వచ్చిన ముగ్గురు దుండగులు బంగారు వస్తువులు కావాలని షాపు యజమాని దిలీప్ తో సంభాషణ మొదలు పెట్టారు. నగలు చూపిస్తుండగా.. హఠాత్తుగా తుపాకీ బయటకు తీసి డబ్బులు ఇవ్వాలని గన్ తో బెదిరించారు. అరుపులు , కేకలు వేయడంతో  అప్రమత్తమైన పక్క షాపు యజమానులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. చుట్టు పక్కల వారంతా వస్తుండడం గమనించిన దుండగులు పారిపోతుండగా.. స్థానికుల సహాయంతో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.