రిపబ్లిక్ పరేడ్ లో వారికి అనుమతి లేదు

రిపబ్లిక్ పరేడ్ లో వారికి అనుమతి లేదు

ఢిల్లీ: రిపబ్లిక్ డే కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ లో ఈసారి కూడా పలు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలు, త్రివిధ దళాల కవాతు ఆకట్టుకోనుంది. ఏటా ఈ వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి జనం ఢిల్లీకి వస్తుంటారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా పరేడ్ చూసేందుకు వచ్చే వారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. 15ఏళ్లలోపు పిల్లలు, డబుల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తికాని వారిని పరేడ్ చూసేందుకు అనుమతించమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ పూర్తైన వారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 

ఈ ఏడాది ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ లో 17 ఆర్మీ బ్యాండ్స్, 25 శకటాలు కనువిందు చేయనున్నాయి. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్ పథ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పహరా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

For more news..

కరోనా బారినపడ్డ శరద్ పవార్

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్