రేపు యూపీలో రెండో దశ పోలింగ్

రేపు యూపీలో రెండో దశ పోలింగ్

ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఓటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. రెండో విడతలో యూపీలోని 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ సామాగ్రితో సిబ్బంది పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. 

సెకండ్ ఫేజ్లో సహారన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ, షాజహాన్పూర్ జిల్లాలో ఎన్నిక జరగనుంది. 586 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. సమాజ్వాదీకి ఈ ప్రాంతంలో మంచి పట్టుంది. ఎస్పీ నేత మహమ్మద్ ఆజం ఖాన్తో పాటు ధరమ్ సింగ్ సైనీ, యూపీ ఫైనాన్స్ మినిస్టర్ సురేశ్ ఖన్నాఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆజంఖాన్ రాంపూర్ సీటు నుంచి పోటీ చేస్తుండగా.. సురేశ్ ఖన్నా షాజహాన్ పూర్, సైనీ నకుడ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో ఉన్నారు. ఆజం ఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం స్వర్ సీటు నుంచి పోటీలో ఉన్నారు.

For more news..

ఏడాదిలోపు డిజిటల్ రూపాయి లాంచ్

ఈజీ డ్రైవ్​ నుంచి టూవీలర్​ లోన్లు