పాలస్తీనాకు మద్దతుగా కానిస్టేబుల్ పోస్ట్.. సస్పెండ్ చేసిన అధికారులు

పాలస్తీనాకు మద్దతుగా కానిస్టేబుల్ పోస్ట్..  సస్పెండ్ చేసిన అధికారులు

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్.. పాలస్తీనాకు మద్దతుగా ఒక పోస్ట్‌ను షేర్ చేసి, విరాళాలు అడిగాడనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. కానిస్టేబుల్‌పై శాఖాపరమైన విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. సుహైల్ అన్సారీ అనే కానిస్టేబుల్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో శాఖ వారీగా చర్యలు తీసుకున్నారు.

సస్పెండ్ అయిన కానిస్టేబుల్, సుహైల్ అన్సారీ, బరేలీ నివాసి. ఆయన కొన్ని నెలలుగా లఖింపూర్ ఖేరీ జిల్లాలో పోస్టింగ్ లో ఉన్నాడు. అక్కడ సర్కిల్ ఆఫీసర్ గా ఉన్న ఖేరీ డీఎస్పీ సందీప్ సింగ్, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి ఈ కేసును పరిశీలిస్తున్నారని, కానిస్టేబుల్ గురించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్‌లో పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న అతని పోస్ట్ గురించి మరింత తెలుసుకుంటున్నారని చెప్పారు.

సస్పెండ్ అయిన కానిస్టేబుల్ అప్‌లోడ్ చేసిన ఈ పోస్ట్‌పై యూపి పోలీసులకు X, ఫేస్‌బుక్‌లో ఫిర్యాదులు అందాయి. కానిస్టేబుల్ ఈ పోస్టులో ప్రజలు నిధులు అందించాలని, పాలస్తీనాను రక్షించండి అని కోరారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన పోస్ట్ చేసినందుకు గానూ ఓ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేసిన మొదటి కేసు ఇదే.

ఈ దాడిలో ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. ఫలితంగా హమాస్ కార్యకర్తలు, పాలస్తీనా వాసులు మరణించారు. అక్టోబరు 7న తమ గడ్డపై హమాస్ ఉగ్రవాది జరిపిన దాడి తర్వాత ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో గాజా స్ట్రిప్‌లోని 2వేల 5వందల మంది నివాసితులు మరణించారు.