‘సర్వెంట్’​ బ్రజేశ్ పాఠక్!

‘సర్వెంట్’​ బ్రజేశ్ పాఠక్!
  • ‘సర్వెంట్’​ బ్రజేశ్ పాఠక్!
  •  ట్విట్టర్ లో పేరు మార్చుకున్న యూపీ డిప్యూటీ సీఎం 

లక్నో :  సమాజ్​వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్​ యాదవ్ కామెంట్లను తిప్పికొడుతూ యూపీ డిప్యూటీ సీఎం ట్విట్టర్​లో తన పేరును ‘సర్వెంట్​ బ్రజేశ్​ పాఠక్’ అని మార్చుకున్నారు. ‘అఖిలేశ్​ రాజు. ఆయన రాయల్​ ఫ్యామిలీ నుంచి వచ్చారు. నేను మాత్రం ప్రజలకు సేవకుడిని’ అని ట్వీట్ చేశారు. అక్టోబర్ 11న జయ ప్రకాశ్​ నారాయణ్​జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించేందుకు లక్నోలోని జేపీ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేపీనిక్)కు అఖిలేశ్ వెళ్లారు. తాళం వేసి ఉండడంతో గేటు దుంకారు. 

దీనిపై  బ్రజేశ్​పాఠక్​ స్పందిస్తూ  ‘‘చట్టాన్ని అతిక్రమించడాన్ని అమితంగా ఇష్టపడే..  అరాచక సమాజ్​వాదీల తీరు ఇట్లానే ఉంటుంది. బాగా గోడలు దూకుతున్న అఖిలేశ్​జీ ఏషియన్​ గేమ్స్​లోకి వెళ్తే మరిన్ని పతకాలు వచ్చేవి” అని అన్నారు. ఈ కామెంట్లపై రియాక్ట్​అయిన అఖిలేశ్ యాదవ్ ‘నేను సర్వెంట్ల కామెంట్లపై స్పందించను’ అని అన్నారు. 

దీనికి శుక్రవారం బ్రజేశ్​పాఠక్ ట్విట్టర్​లో స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ పేరును ‘సర్వెంట్​ బ్రజేశ్​ పాఠక్’ అని మార్చుకున్నారు. ‘అఖిలేశ్ గుండెల్లోంచి వచ్చిన మాటల ఆధారంగా నేను స్పందిస్తున్న. ఆయన అన్నది నిజమే. నేను సర్వెంట్​నే.. డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవకుడిగానే పనులు చేస్తున్నాను’ అని కౌంటర్ ఇచ్చారు.