యూపీలో ఘోర ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. 11 మంది మృతి

యూపీలో ఘోర ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. 11 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ఒక ప్రైవేటు వాహనం కాలువలోకి దూసుకెళ్లడంతో 11 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నిపింది. భారీ వర్షాల కారణంగా అదుపు తప్పిన వెహికిల్ కాలువలోకి దూసుకెళ్లటంతో ప్రమాదం జరిగింది. వెహికిల్ నీళ్లలో మునిగి పోవడంతో కారులో ఉన్న 11 మంది చనిపోయారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. 

గోండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. ప్రిథ్వినాథ్ దేవాలయానికి 15 మందితో వెళ్తున్న  వాహనం అదుపుతప్పి కాలువలో పడినట్లు గోండా ఎస్పీ వినీత్ జైశ్వాల్ తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం యోగిఆదిత్యానాథ్.

ఈ ప్రమాదం గురించి స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. 11 మంది మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.