ఇంట్లో మద్యం స్టాక్ ఉంటే లైసెన్స్ తప్పనిసరి

ఇంట్లో మద్యం స్టాక్ ఉంటే లైసెన్స్ తప్పనిసరి

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలపై వచ్చే ఆదాయంపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు. లిమిట్ కు మించి ఇంట్లో మద్యం నిల్వ చేసుకోవాలంటే కచ్చితంగా లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. తాజా నిబంధనల ప్రకారం 6 లీటర్ల IMFL, 3 లీటర్ల వైన్‌, 7.8 లీటర్ల బీర్‌ను లైసెన్స్‌ లేకుండా ఇంట్లో పెట్టుకోవచ్చు. అంతకుమించి మద్యం నిల్వ చేసుకుంటే లైసెన్స్‌ తీసుకోక తప్పదు. లైసెన్స్‌ కావాలంటే ఏటా రూ. 12,000 వేల ఫీజుతో పాటు రూ. 51,000 వేల సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టాల్సి ఉంటుంది.

అంతేకాదు మద్యం ధరలను పెంచాలని కూడా నిర్ణయించింది యోగి సర్కార్. బీరు ఎక్కువగా తాగితే అధిక ఆల్కాహాల్‌ ఉన్న వైన్‌ల వినియోగం తగ్గుతుందని యోగి భావిస్తున్నారు. అందుకే బీర్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలని నిర్ణయించారు.