అమిత్ షాపై కామెంట్స్.. రాహుల్ గాంధీకి నోటీసులు

అమిత్ షాపై కామెంట్స్.. రాహుల్ గాంధీకి నోటీసులు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కొన్ని వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి డిసెంబర్ 16న  సుల్తాన్‌పూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు  సమన్లు పంపింది.  2024 జనవరి 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.   

2018 ఆగస్టు 4న బీజేపీ నేత విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై దావా వేశారు.  గతంలో దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది.  కానీ ఆయన రాకపోవడంతో మరోసారి సమన్లు జారీ చేసింది.  

2018 జూలై 15న  కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా ఆరోపించారు. దీంతో 2023 డిసెంబర్ 16న విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీకి సమన్లు ​పంపింది కోర్టు.