సైకో మొగుడు : ఫోన్ మాట్లాడితేనే భార్యను చంపేస్తావా..

సైకో మొగుడు : ఫోన్ మాట్లాడితేనే భార్యను చంపేస్తావా..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దీపావళి రోజున తన సోదరితో ఫోన్‌లో మాట్లాడినందుకు మద్యం మత్తులో ఉన్న భర్త 45 ఏళ్ల మహిళను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. సుశీలాదేవిని ఢిల్లీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు అయిన దేవపాల్ వర్మ (50) అనే వ్యక్తి ఈ హత్య చేశాడు. దీపావళి రోజున పూజ ముగించుకుని, సుశీల తన సోదరికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపుతూ.. కాసేపు ఫోన్లో మాట్లాడడంతో కోపోద్రిక్తుడైన భర్త తన రైఫిల్‌తో ఆమె ఛాతీ, మెడలో రెండు బుల్లెట్లను దించాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, నిందితుడు నేరం అంగీకరించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.

వర్మను అరెస్టు చేసి రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ (నగరం) సురేంద్ర నాథ్ తివారీ తెలిపారు. “సంఘటన జరిగిన సమయంలో ఆ వ్యక్తి తాగి ఉన్నాడు. భార్య గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఆమె ‘క్యారెక్టర్‌’పై అతనికి అనుమానం వచ్చింది. ఆయన కుమారుడు హిమాన్షు వర్మ ఫిర్యాదు మేరకు వర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపినట్లు తివారీ చెప్పారు.

ALSO READ :- మూడు రోజులుగా టెన్నల్ లోనే.. 40 ప్రాణాలపై ఆందోళన