
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ మోస్తరు స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్..20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హరీన్ డియోల్ 32 బంతుల్లో, ఏడు ఫోర్లతో 46 పరుగులు చేయగా..ఓపెనర్ సబ్బినేని మేఘన 24 పరుగులు, గార్డెనర్ 25 పరుగులు, దయాళన్ హేమలత 21 పరుగులతో రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంజలీ శర్వాని, తహ్లియా మెక్ గ్రాత్ ఒక్కో వికెట్ తీశారు.