వీడెంత.. వీడి వయసెంత..! : ఆంటీ.. ఆంటీ అంటూ ర్యాగింగ్ చేస్తున్నాడంట..!

వీడెంత.. వీడి వయసెంత..! : ఆంటీ.. ఆంటీ అంటూ ర్యాగింగ్ చేస్తున్నాడంట..!

వయస్సును బట్టి బిహేవ్ చేయాలి.. చేస్తున్న పని ఏంటీ అనే సోయి ఉండాలి.. అలా లేకపోతే ఇబ్బందులు తప్పవు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాలో.. మైనర్.. అంటే 18 ఏళ్ల లోపు.. 15 ఏళ్ల కుర్రోడు.. ఆంటీ.. ఆంటీ అంటూ అమ్మాయిలను టీజ్ చేస్తున్నాడు.. పోనిలే పిల్లోడు అనుకుని వదిలేస్తే.. రోజు రోజుకు వీడి ఆగడాలు శృతిమించాయంట.. ఎవర్ని పడితే వాళ్లను టీజ్ చేయటం.. ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టాడు.. దీంతో ఓ షాపు ఓనర్ రోడ్డుపైనే బుద్ధి చెప్పింది. చెప్పులతో నాలుగు పీకింది.. కింద పడేసి కొట్టింది.. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

అది యూపీలో ని బులంద్ షహర్ లో నిత్యం రద్దీగా ఉంటే అన్సారీ మార్కెట్.. ఓ మైనర్ అబ్బాయిని పట్టుకొని మహిళ చితకబాదుతోంది. నడివీధిలో కింద పడేసి కాళ్లతో తన్నింది.. చేతులతో కొట్టింది..కర్రతో కొట్టింది. అందరు చూస్తుండగానే ఇదంతా చేస్తోంది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మహిళ బాలుడిని విపరీతంగా కొట్టడం పెద్ద కారణమే ఉంది.. నిత్యం మార్కెట్ వచ్చి మహిళలు, బాలికలను టీజ్ చేస్తున్నాడట.. పోనీలే పిల్లాడు కదా అని ఊరుకుంటే.. రోజు రోజుకు వీడి ఆగడాలు ఎక్కువై పోయాయట.. దీంతో ఆ మహిళ వాడికి తగిన బుద్ది చెప్పిందని మార్కెట్ దుకాణదారులు మెచ్చుకున్నారట.

ఈ ఘటన బుధవారం (నవంబర్ 1) బులంద్ షహర్లోని అన్సారీ మార్కెట్లో జరిగింది. మైనర్ బతిమిలాడినా ఆ మహిళ విడిచిపెట్టకుండా ఓ రేంజ్ లో ఉతికి ఆరేసినట్లు ఈ వీడియో చూస్తే.. అర్థమవుతుంది. అయితే దీనిపై ఎటువంటి పోలీసులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. 

Also Read : మోసగాళ్లకే మోసగాడు : కత్తి చూపించి.. దర్జాగా బ్యాంక్ దోపిడీ చేశాడు..

ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు మహిళ, మైనర్ ఇద్దరిపై విమర్శలు చేశారు. మైనర్ చేసింది తప్పే.. కానీ జనం ముందు కొట్టడం సరియైంది కాదు అంటున్నారు కొందరు నెటిజన్లు.  మరో నెటిజన్ స్పందిస్తూ మైనర్ కు కౌన్సెలింగ్  అవసరమని చెప్పారు...