
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొణిదెల వంశానికి వారసురాలు రావడంతో.. మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక డెలివరీ తరువాత ఉపాసనతో పాటు పాప కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలుపడంతో.. జూన్ 23 శుక్రవారం ఉపాసన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Also Read : పాపకు నా పోలికలే వచ్చాయి.. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్‌చరణ్.. "జూన్ 20న ఉదయం పాప పుట్టింది. ఈరోజు పాప, ఉపాసనను తీసుకుని ఇంటికి వెళుతున్నాం. తమను చాలా జాగ్రత్తగా చూసుకున్న వైద్యులు, హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు. అలాగే మా కోసం చేసిన ప్రార్థనలు అభిమానులను ఇప్పటికీ మర్చిపోలేను. మీ అందరి ఆశీస్సులు పాపకు ఎల్లప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంతోషకర సందర్భంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటికే నేను, ఉపాసన పాప కోసం ఒక పేరు అనుకున్నాం. అది 21వ రోజున వెల్లడిస్తాం. చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. అనుకున్న సమయంలో భగవంతుడు మాకు పాపను ప్రసాదించాడు' అంటూ సంతోషం వ్యక్తం చేశారు చరణ్.