ఉపేంద్ర, సుదీప్ డేంజరస్ డాన్స్‌‌

ఉపేంద్ర, సుదీప్ డేంజరస్ డాన్స్‌‌

కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన నటులు ఉపేంద్ర, సుదీప్. ఎంతో ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరూ కలిసి మస్త్ మజా మాది, ముకుంద మురారి వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి స్క్రీన్‌‌పై కనిపించబోతున్నారు. ఆర్.చంద్రు దర్శకత్వంలో ఏడు భాషల్లో తెరకెక్కుతున్న ‘కబ్జ’ మూవీలో నటిస్తున్నారు. లాంకో శ్రీధర్ సమర్పణలో ఆర్. చంద్రశేఖర్, మునీద్ర కె. పురా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో ఉపేంద్ర, సుదీప్ డేంజరస్‌‌ డాన్స్‌‌గా కనిపిస్తున్నారు. అండర్‌‌‌‌ వరల్డ్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ ఇది. 1947–1984 మధ్య కాలంలోని మాఫియాను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే  రెట్రో లుక్‌‌లో ఉన్నారు ఉపేంద్ర, సుదీప్. హీరోయిన్స్‌‌గా నయనతార, కాజల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్‌‌పేయ్, అతుల్ కులకర్ణి,  ప్రకాష్ రాజ్, కబీర్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కె.జి.యఫ్’ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.