దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సర్వీసులు

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సర్వీసులు

యూపీఐ ట్రాన్సాక్షన్స్ పనిచేయడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు.  ఫెయిల్ అయిన యూపీఐ లావాదేవీల స్క్రీన్ షాట్లను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వేలాది మంది యూజర్లు #UPIDOWN అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

అయితే చాలా మందికి యూపీఐ డౌన్  అయిందనే విషయం తెలియక పేమెంట్లు చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు పేమెంట్ గేట్ వేలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి. 

Google Pay, PhonePe, Paytm, BHIM  వంటి అప్లికేషన్‌ల ద్వారా డబ్బులు పంపించలేక చాలా గంటల నుంచి ఇబ్బందులు పడుతున్నామని..   త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.   యూపీఐ స‌ర్వీసులు డౌన్ కావ‌డం ఫ‌స్ట్ టేం కాదు. కానీ కీల‌క‌మైన టైంలో స‌ర్వర్లు మొరాయిస్తుండ‌టం యూజ‌ర్లను చికాకు పెడుతున్నది.