MDRఛార్జీలకు ముందే ..1.8 శాతం తగ్గిన యూపీఐ లావాదేవీలు

MDRఛార్జీలకు ముందే ..1.8 శాతం తగ్గిన యూపీఐ లావాదేవీలు

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ లో 1.8 శాతం తగ్గాయి.  ఆర్​బీఐ డేటా ప్రకారం.. ఆగస్టులో 2,450 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, సెప్టెంబర్​లో ఇవి 2,407 కోట్లకు పడిపోయాయి. లావాదేవీల మొత్తం విలువ కూడా 1.50 శాతం క్షీణించి రూ.29.82 లక్షల కోట్ల నుంచి రూ.29.37 లక్షల కోట్లకు పడిపోయింది. 

పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీల అమలుకు కొన్ని రోజుల ముందు ఈ లెక్కలు రావడం గమనార్హం. ఆగస్టులో 31 రోజులు, సెప్టెంబర్ లో 30 రోజులు ఉండడమే ఈ తగ్గుదలకు కారణమని యూపీఐ సిస్టమ్​ను నిర్వహించే ఎన్​సీపీఐ వర్గాలు తెలిపాయి.