న్యూఢిల్లీ: ఇక నుంచి పిల్లలు, టీనేజర్స్ కూడా తమ యూపీఐ వాలెట్ల ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఈ సర్వీస్‌లను అందించేందుకు జూనియో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చింది. జూనియో యాప్ ద్వారా పిల్లలు బ్యాంక్ ఖాతా లేకుండానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు చేయగలుగుతారు.
వాలెట్ల నుంచి డబ్బు కట్ అవుతుంది. ఈ వాలెట్‌ను తల్లిదండ్రులు డబ్బుతో లోడ్ చేయొచ్చు. ఖర్చు లిమిట్‌ను కూడ్ సెట్ చేయవచ్చు. ‘‘తల్లిదండ్రులు కేవైసీ పూర్తి చేసి పిల్లల ఖాతా క్రియేట్ చేయాలి. వర్చువల్ రూపే కార్డ్ వెంటనే జారీ అవుతుంది. అవసరమైతే ఫిజికల్ కార్డ్ కూడా పొందొచ్చు.
మా యాప్‌లో టాస్క్ రివార్డ్స్, సేవింగ్స్ గోల్స్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల పిల్లల్లో డబ్బు విలువపై అవగాహన పెరుగుతుంది. భవిష్యత్తులో మెట్రో, బస్సు ప్రయాణాలకు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సీఎంసీ) సపోర్ట్, బ్రాండ్ ఓచర్లు వంటి ఫీచర్లు కూడా జోడిస్తాం”అని జూనియో పేమెంట్స్ వివరించింది.
