హాట్​ హాట్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మా, అటుకులు!

హాట్​ హాట్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మా, అటుకులు!
పెరిగిన ప్యాకేజ్డ్ బ్రేక్‌‌‌‌ఫాస్ట్ వ్యాపారం సిరియల్స్‌‌, ఓట్స్‌‌కూ డిమాండ్ సిరియల్స్‌‌ కేటగిరీలో పెరిగిన లాంచ్‌‌లు బిజినెస్​ డెస్క్​, వెలుగు: 20వ సెంచరీ వచ్చే వరకు ఇండియన్లకు అసలు బ్రేక్‌‌‌‌ఫాస్ట్ అనే పదమే తెలియదు. ఇప్పటికీ చాలా మంది బ్రేక్‌‌ఫాస్ట్‌‌ చేయరు. ఉదయాన్నే ఒక కప్పు కాఫీ లేదా ఛాయ్‌‌తో బిస్కెట్లు తినేసి కడుపు నింపుకుంటారు. ఇక పొలం పనులకు వెళ్లే వారు అయితే ఉదయాన్నే అన్నం తినేసి పనికి బయలుదేరతారు. కానీ వెస్ట్రన్ సొసైటీల్లో బ్రేక్‌‌ఫాస్ట్ అనేది కంపల్సరీ. ఇండియన్లకు కూడా బ్రేక్‌‌ఫాస్ట్‌‌ను అలవాటు చేయడం కోసం కెలాగ్స్‌, ఎంటీఆర్, నెస్లే వంటి పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌‌ను తీసుకురావడం ప్రారంభించాయి. గత రెండు దశాబ్దాల నుంచి కూడా ఇండియన్ కన్జూమర్ ఎకానమీ బాగా పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకోవడానికి కన్జూమర్లు బ్రాండ్లు కూడా ప్రయత్నిస్తున్నాయి. కరోనా లాక్‌‌డౌన్ వచ్చిన తర్వాత చాలా మంది ఇండియన్లు బ్రేక్‌‌ఫాస్ట్‌‌ను స్కిప్ చేయడం తగ్గించారు. హెల్తీగా ఉండటం కోసం  మంచి ఫుడ్‌‌ను తీసుకుంటున్నారు. ఉదయాన్నే లేవగానే మిల్క్‌‌తో పాటు ఏదైనా ఆహారం తీసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకాక హోమ్‌‌ టేస్ట్‌‌ ఉన్న ప్యాకేజ్డ్ బ్రేక్‌‌ఫాస్ట్‌‌ను తినడం  పెంచారు. దీంతో ప్యాకేజ్డ్ బ్రేక్‌‌ఫాస్ట్ స్పేస్‌‌లో ఉన్న బ్రాండ్లకు కలిసి వచ్చింది. ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల ద్వారాఫ్రెష్ బ్రేక్‌‌ఫాస్ట్ ఆప్షన్లను కస్టమర్ల ఇళ్ల వద్దకే ఆఫర్ చేయడం ప్రారంభించాయి. హాట్‌‌ సిరియల్స్ కేటగిరీలో కొత్తగా లాంచ్‌‌లు పెరిగాయి. ప్యాకేజ్డ్ రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్‌‌లో అటుకులు, ఉప్మా వంటి సంస్థలకు హాట్ ప్రొడక్ట్‌‌గా ఉన్నాయి. బ్రేక్‌‌ఫాస్ట్ బిజినెస్‌‌లోకి రావడానికి చాలా సంస్థలు వీటిపై దృష్టిపెట్టాయి. నెస్లే, ఐటీసీ, ఎంటీఆర్, గిట్స్, మదర్స్ రెసిపీ వంటి ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీలు గత కొన్నేళ్ల నుంచే ప్యాకేజ్డ్ నాస్తాలను లాంచ్ చేస్తున్నాయి. గత నెలలో ఈ జాబితాలోకి కెలాగ్స్‌ కూడా చేరింది. ప్యాకేజ్డ్ ఉప్మాను కెలాగ్స్‌ తీసుకొచ్చింది. తన ప్రొడక్ట్ పోర్ట్‌‌ఫోలియోలో తొలిసారి ఒక ఇండియన్ మీల్‌‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. కెలాగ్స్‌ ఇండియా ఎక్కువగా అర్బన్ హౌస్‌‌హోల్డ్స్‌‌  బ్రేక్‌‌ఫాస్ట్ కోసం కార్న్‌‌ఫ్లేక్స్, చాకోస్ వంటి వాటిని ఆఫర్ చేస్తోంది. సిరియల్స్, ఓట్స్ వంటివి కూడా ఇప్పుడు ఇండియన్ల బ్రేక్‌‌ఫాస్ట్ లిస్ట్‌‌లో వచ్చి చేరాయి. దీంతో మల్టినేషనల్ కంపెనీలన్ని వెస్ట్రన్ బ్రేక్‌‌ఫాస్ట్‌‌ ఐటమ్స్‌‌ను ఇక్కడికి తీసుకొస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. హైదరాబాద్‌‌కు చెందిన హెల్త్ సూత్రా కూడా బ్రేక్‌‌ఫాస్ట్ సెరెల్ రాగి ఫ్లేక్స్‌‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాక రెడీ టూ కుక్ ఉప్మాను, జొన్నలు, చిరుధాన్యాలతో తయారు చేసే బ్రేక్‌‌ఫాస్ట్ ఫుడ్‌‌ను ఇది అందిస్తోంది. ‘మేము సంప్రదాయ ఆహార పద్ధతులు రాగులు, జొన్నలు, చిరుధాన్యాలపై ఎక్కువగా ఫోకస్ చేశాం. వీటిని వేల సంవత్సరాల నుంచి ఇండియన్లు తింటున్నారు’ అని హెల్త్‌‌సూత్రా సీఈవో క్రిష్ణ పోపురి చెప్పారు. ఫ్లేక్స్‌‌కు బదులు నేచురల్ గ్రెయిన్స్‌‌ను తాము అందిస్తున్నట్టు తెలిపారు. పెప్సికో క్వాకర్ ఓట్స్ కూడా క్విక్ కుకింగ్ ఈట్స్‌‌ను అమ్ముతోంది. మ్యారికో కూడా సఫోలా నుంచి ఓట్స్ ప్రొడక్ట్స్ వరకు తన రేంజ్‌‌ను విస్తరించింది. రెడీ టూ కుక్‌ వేరియంట్స్ బాగా సక్సెస్ అవుతున్నట్టు పేర్కొంది. ఇండియాలో ప్రతి వర్గానికి, ప్రతి రాష్ట్రానికి  బ్రేక్‌‌ఫాస్ట్ ఐటమ్స్ మారిపోతూ ఉంటాయి. అటుకులను ఒకే ఫ్లేవర్‌‌‌‌లో అందిస్తే ఇండియాలో అది వర్క్‌‌ అవుట్ కాదని క్రిష్ణ పోపురి చెప్పారు. మహారాష్ట్రలో ఒక రకమైన అటుకులను తింటే.. తెలంగాణ, కర్నాటకలో మరొక రుచికరమైన అటుకులను తింటారని పేర్కొన్నారు. రెడీ టూ కుక్ మార్కెట్… రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ డేటా ప్రకారం ఇండియా రెడీ టూ కుక్ మార్కెట్ 2019లో రూ.2,100 కోట్లుగా ఉంది. 2024 నాటికి ఇది వార్షికంగా 18 శాతం చొప్పున పెరిగి రూ.4,800 కోట్లకు పెరుగుతుందని అంచనాలున్నాయి. రెడీ టూ కుక్ మార్కెట్లో 57 శాతానికి పైగా బ్రేక్‌‌ఫాస్ట్‌‌ దే ఉంది. ప్రస్తుతం రెడీ టూ కుక్ బ్రేక్‌‌ఫాస్ట్ మార్కెట్‌‌లో మ్యారికో, ఎంటీఆర్ ఫుడ్స్, గిట్స్ ఫుడ్స్, మదర్స్ రెసిపీ, కెలోగ్స్ టాప్ ప్లేయర్స్‌‌గా ఉన్నాయి. For More News.. కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మృతి ఎనీటైమ్​ నో వాటర్.. మూలనపడ్డ వాటర్​ ఏటీఎంలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. భవిష్యత్తులో నేను బీజేపీలో చేరుతా