
హైదరాబాదీలను ఐపీఎల్ మ్యాచ్ లు మరోసారి ఉర్రూతలూగించనున్నాయి. మరో రెండ్రోజుల్లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. దీంతో ట్విన్ సిటీస్ లో ధనాధన్ క్రికెట్ ఫీవర్ ఓ రేంజ్ కు చేరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ,రాజస్థా న్ రాయల్స్ జట్లు శుక్రవారం అమీ-తుమీకి రెడీ అవుతున్నాయి. హోమ్ టీమ్సన్ రైజర్స్ కు సొంతగడ్డపై ఇది తొలి మ్యాచ్ కావడంతో పాటు, సన్ రైజర్స్ గతేడాది రన్నరప్ గా నిలవడంతో అభిమానుల్లో ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ మ్యాచ్ కోసం స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సారి మొత్తం ఏడు మ్యాచ్ లు ఉప్పల్‌లో ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈసారి ఏడు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మార్చి 29న రాజస్థా న్ రాయల్స్, 31నరాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో హోమ్ టీమ్సన్ రైజర్స్ తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్, 14న ఢిల్లీ క్యాపిటల్స్ తో-,17న చెన్నై సూపర్ కింగ్స్, 21న కోల్‌కతా నైట్‌రైడర్స్ , 29న కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లు ఆరెంజ్ ఆర్మీతో తలపడనున్నాయి. భారీ ఏర్పాట్లు ..ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఉప్పల్ స్టేడియంలోభారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఈ మ్యాచ్ లనునిర్వహిస్తారు. స్టేడియంలో ఎలాంటి అవాంచ-నీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంలో ఇప్పటికే సీసీకెమెరాలు ఉండగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ను సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంకు వచ్చే అభిమానుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
బాహుబలిని అవుతా: వార్నర్
ఒంటి చేత్తో మ్యాచ్ ను లాగేసుకునే సామర్థ్యం కలిగిన సన్ రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నటనలో తాను మరో బాహుబలి అవుతానని అన్నాడు. బాల్ టాంపరింగ్ వివాదం వల్ల కొంత కాలం క్రికెట్ కు దూరమైన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో రీఎంట్రీతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఫ్రాంచైజీ తరఫున పలు యాడ్స్ లో నటిస్తున్నాడు. అందులోభాగంగా కేన్ విలియమ్సన్ తో కలిసి వార్నర్ ఓ షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకుంటే మీ లక్ష్యమేంటి అని షూటింగ్ అనంతరం కేన్ , వార్నర్ ను ప్రశ్నించగా తాను బాహుబలిని అవుతానని డేవిడ్ వార్నర్ అన్నాడు. కేన్ మాత్రం యాక్టింగ్ తన వల్ల కాదంటూ చేతులెత్తే శాడు. ఇందుకు సంబంధించి వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది.