
టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్(Sharwanand) ఒకరు. లేటెస్ట్ గా శర్వా కొత్త మూవీపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మూవీలో శర్వానంద్ నటిస్తున్నారు. ఈ మూవీలో శర్వాకి జోడీగా ఉప్పెన క్యూటీ కృతి శెట్టి(KrithiShetty)ని సెలెక్ట్ చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇవాళ (సెప్టెంబర్ 21న) కృతి బర్త్ డే స్పెషల్ గా శర్వా 35(Sharwa35) లో నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రసెంట్ హీరో శర్వా, కృతి ఇద్దరు ప్లాప్స్తో సతమవుతున్నారు. మరి ఫస్ట్ టైం వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కాన్ఫిడెన్స్తో ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: రైల్వే కూలీగా రాహుల్ గాంధీ.. ఢిల్లీ రైల్వేస్టేషన్లో లగేజీ మోశాడు
శర్వా 35 వర్కింగ్ టైటిల్తో వస్తోన్న ఈ మూవీకి బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇదే టైటిల్ కనుక ఫిక్స్ అయితే..బేబమ్మ..బేబీగా మారే చాన్సు ఉంది. ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన ట్యూన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో శర్వా 35 నుంచి ఆఫీషయల్ టైటిల్ ప్రకటనతో పాటు టీజర్ అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ తెలిపారు.
అబ్దుల్ వాహబ్ నుంచి వచ్చిన ఖుషి మూవీ సాంగ్స్ చార్ట్ బ్లాస్టర్గా నిలిచినా విషయం తెలిసందే. దీంతో అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్ గా మారబోతున్నారు. ఇక ఈ చిత్రానికి DOP విష్ణు శర్మ, ఎడిటర్గా ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ గా జానీ షేక్ వర్క్ చేయబోతున్నారు.
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.. భలే మంచి రోజు మూవీతో ఇండస్ట్రీ డీసెంట్ హిట్ కొట్టారు. ఇక ఆ తర్వాత డైరెక్ట్ చేసిన శమంతకమణి, అలాగే నాగార్జున, నాని లతో ముల్టీస్టార్ర్ర్ దేవదాసు చిత్రాలతో యావరేజ్ అనిపించుకున్నారు. ఇక ఆదిత్య గత చిత్రం హీరో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా శర్వానంద్ తో హిట్ కొట్టాలని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్ తీస్తున్నట్లు తెలుస్తుంది.
The stunning @IamKrithiShetty in a beautifully woven character ✨
— People Media Factory (@peoplemediafcy) September 21, 2023
- https://t.co/g3sToxaYO6
Team #Sharwa35 extends its heartfelt wishes to the birthday girl ❤️
Massive Title Announcement & Teaser event updates soon ❤️?#HBDKrithiShetty@ImSharwanand @SriramAdittya… pic.twitter.com/Xrrf7ccxxL