సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్​ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  ఈ కేసు విచారణ వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాది  సిద్ధార్థ లూథ్రా.. సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు..ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలంటూ.. ఆ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు ఆర్కే.ఈ రోజు ( నవంబర్​ 29) సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది.  ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా కోరారు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. దీంతో.. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కాగా, ఓటుకు నోటు కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.