కాన్పూర్ లో 123 జికా వైర‌స్ కేసులు న‌మోదు

V6 Velugu Posted on Nov 15, 2021

క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ప్రస్తుతం జికా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక్క కాన్పూర్‌ పట్టణంలోనే ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 96 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ తెలిపారు. మరో మూడు కేసులు లక్నోలో, ఒక కేసు కన్నౌజ్‌లో నమోదైందని చెప్పారు. వైరస్‌ ఎలా, ఎవరితో వ్యాప్తి చెందిందనే విషయాన్ని తెలుసుకుంటున్నామన్నారు.

కాన్పూర్‌లో మొదటి జికా వైరస్‌ కేసు అక్టోబర్‌ 23న నమోదైంది. నగరంలో మొదటి సారిగా  ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (IAF)కు చెందిన వారెంట్‌ ఆఫీసర్‌లో వైరస్‌ లక్షణాలను గుర్తించారు. పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్‌ వచ్చింది. గత కొన్ని వారాలుగా జికా వైరస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Tagged UP, Kanpur, 123 Zika virus cases, active cases 96

Latest Videos

Subscribe Now

More News