అంతరిక్షంలో ఆయుధాలు..అమెరికా స్పేస్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ సంచలన ప్రకటన

అంతరిక్షంలో ఆయుధాలు..అమెరికా స్పేస్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ సంచలన ప్రకటన
  • ఆన్‌‌‌‌‌‌‌‌- ఆర్బిట్‌‌‌‌‌‌‌‌ వెపన్స్‌‌‌‌‌‌‌‌పై తొలిసారి అంగీకారం
  • రష్యా, చైనాలకు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకే ఇది
  • ఎలాంటి ఆయుధాలనేది మాత్రం గోప్యం
  • గోల్డెన్‌‌‌‌‌‌‌‌ డోమ్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా వ్యాఖ్యలు
  • స్పేస్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌కు కైనెటిక్‌‌‌‌‌‌‌‌ మార్గాలు సిద్ధం

వాషింగ్టన్: అంతరిక్షంలో తాము ఆయుధాలను మోహరించామని అమెరికా స్పేస్ ఫోర్స్ తొలిసారి అధికారికంగా ప్రకటించింది. స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాడి చేయగల వెపన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోహరించడం నిజమేనని తొలిసారి అంగీకరించింది. అయితే, అవి ఎలాంటి ఆయుధాలన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై ఇటీవల మేరీల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేషనల్ హార్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన వార్షిక ఎయిర్, స్పేస్ అండ్ సైబర్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూఎస్ ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మీంక్ మాట్లాడారు. శత్రువుల నుంచి అమెరికా బలగాలను రక్షించడానికి ‘ఆన్ -ఆర్బిట్’ ఆయుధం అవసరమని పేర్కొంటూ.. చైనా, రష్యాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. 


క్షిపణుల ముప్పు నుంచి అమెరికాను రక్షించడానికి ట్రంప్ ప్రభుత్వం గోల్డెన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఔటర్ స్పేస్‌‌లో తగిన ఏర్పాట్లను చేస్తున్న తరుణంలో మీంక్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ‘‘శత్రువుల దాడుల నుంచి జాయింట్ ఫోర్స్‌‌ను రక్షించగల ఆన్ -ఆర్బిట్ స్పేస్ కంట్రోల్ ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నాయని యూఎస్ స్పేస్ ఫోర్స్ ప్రతినిధి కూడా ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘స్పేస్ డొమైన్‌‌ను సవాల్ చేయడానికి, నియంత్రించడానికి అవసరమైన మిషన్‌‌లను స్పేస్ కంట్రోల్ కలిగి ఉంటుంది. 

శత్రువుల సామర్థ్యాలను ప్రభావితం చేయడానికి కైనెటిక్, నాన్-కైనెటిక్ మార్గాలను అనుసరిస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే, ‘‘మిలిటరీ మోడరైజేషన్ స్ట్రాటజీలో భాగంగా అంతరిక్ష, కౌంటర్‌‌స్పేస్ సామర్థ్యాలను చైనా అభివృద్ధి చేస్తోంది. అంతరిక్షాన్ని రష్యా యుద్ధ రంగంగా చూస్తుంది. భవిష్యత్తు సంఘర్షణలలో స్పేస్ ఆధిపత్యం నిర్ణయాత్మకం అవుతుందని నమ్ముతుంది” అని యూఎస్ స్పేస్ ఫోర్స్ పేర్కొంది. కాగా, 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం.. ఆర్బిట్‌‌లో సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉంచడాన్ని నిషేధించారు. దీంతో అప్పటినుంచి అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు సైనిక కమ్యూనికేషన్లు, నిఘా, నావిగేషన్‌‌కు కీలకమైన ప్రత్యర్థుల ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే మార్గాలపై దృష్టిపెడుతున్నాయి.