వెనెజువెలా బోట్ పేల్చేశాం ..అమెరికా నేవీ ప్రకటన

వెనెజువెలా బోట్ పేల్చేశాం ..అమెరికా నేవీ ప్రకటన

వాషింగ్టన్: అమెరికా ఆర్మీ.. వెనెజువెలా కు చెందిన స్మగ్లర్ల బోట్ ను పేల్చేసింది. అంతర్జాతీయ జలాల పరిధి దాటి అమెరికా వైపు వస్తుండగా సౌత్‌‌కామ్ ప్రాంతంలో దాడి చేసినట్లు నేవీ తెలిపింది. ఆ బోట్​లో డ్రగ్స్​ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే దాడిచేసినట్టు భద్రతా దళాలు వివరించాయి. బోటును పేల్చేయడంతో ముగ్గురు స్మగ్లర్లు మృతిచెందినట్టు వెల్లడించాయి. ఈ ఘటనను ధ్రువీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ట్రూత్ సోషల్​లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

 అందులో బోట్​ కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. కాగా, భద్రతా దళాల దాడిలో మృతిచెందిన ముగ్గురిని 'నార్కోటెర్రరిస్టులు'గా ట్రంప్ వర్ణించారు. అత్యంత క్రూరమైన డ్రగ్స్ ముఠాలు అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి, దేశ ప్రయోజనాలకు ముప్పుగా మారాయని ట్రంప్ పేర్కొన్నారు.