కరోనాను యూఎస్‌ బాగా కట్టడి చేసింది.. ఇండియాకే ఇబ్బంది: ట్రంప్‌

కరోనాను యూఎస్‌ బాగా కట్టడి చేసింది.. ఇండియాకే ఇబ్బంది: ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా మహమమ్మారిని యూఎస్‌ బాగా కట్టడి చేసిందని, ఇండియా మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. “ మనం చాలా బాగా చేస్తున్నామని అనుకుంటున్నాను. ఏ దేశం చేయని విధంగా మనం పని చేశామని అనుకుంటున్నాను. మీరు పరిశీలిస్తే ఇప్పుడు ఏ దేశాల గురించి మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. మనది చైనా, ఇండియా మినహా మిగతా దేశాల కంటే పెద్ద దేశం. చైనా ప్రస్తుతం భారీ మంటలను ఎదుర్కోంటోంది. ఇండియా విపరీతమైన సమస్యను ఎదుర్కోంటోంది. భారతదేశానికి విపరీతమైన సమస్య ఉంది” అని ట్రంప్‌ అన్నారు. యూఎస్‌లో చాలా టెస్టులు చేశారని, అందుకే అన్ని కేసులు బయట పడుతున్నాయని చెప్పారు. వేరే ఏ దేశం మనం చేసినన్ని టెస్టులు చేయలేదని చెప్పారు. మనం చాలా బాగా కట్టడి చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు.