ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసుకు 22 ఏళ్ల జైలు శిక్ష

ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసుకు 22 ఏళ్ల జైలు శిక్ష

నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి డెరిక్‌కు స్థానిక కోర్టు 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది మే 25న డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే కారణంతో అందరూ చూస్తుండగానే ఫ్లాయిడ్‌ను డెరిక్ కాలుతో మెడ మీద నొక్కి చంపాడు. ఫ్లాయిడ్ మెడ మీద డెరిక్ కాలు మోపడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. ప్రాణం పోతోందని ఫ్లాయిడ్ ఆర్తనాదాలు చేసిన డెరిక్ కనికరించలేదు. ఫ్లాయిడ్ హత్యపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో డెరిక్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ కేసుకు సంబంధించి నేడు మిన్నేపోలీస్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు డెరిక్‌కు 270 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి పీటర్ కాహిల్ తీర్పు చెప్పారు. కాగా.. తీర్పు వెలువడుతున్న సమయంలో డెరిక్‌లో పశ్చాత్తాపం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.