అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో  రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. టెక్సాస్ లోని హూస్టన్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు. హూస్టన్  సిటీలోని ఇంటికి దుండగుడు నిప్పంటించాడు. దీంతో అందులోని వారు బయటకు పరుగులు పెడుతుండగా.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయయ్యాయి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడని సిటీ పోలీస్  చీఫ్  ట్రాయ్  ఫిన్నర్ ప్రకటించారు.  దీంతో మొత్తం నలుగురు చనిపోయారన్నారు. బాధితులంతా 40 నుంచి 60 ఏళ్ల మధ్యవారని తెలిపారు. నిందితుడు ఆఫ్రికన్ -అమెరికన్  అని  పోలీసులు చెప్పారు. 

డెట్రాయిట్ ల్ ఓ దుండుగుడు రెచ్చిపోయాడు.  నలుగురు వ్యక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. వారిలో ముగ్గురు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.