యూఎస్‌‌ ఓపెన్‌ విజేత డానిల్‌‌ మెద్వెదెవ్‌

యూఎస్‌‌ ఓపెన్‌ విజేత డానిల్‌‌ మెద్వెదెవ్‌
  •     యూఎస్‌‌ ఓపెన్‌‌ ఫైనల్లో ఓడిన నొవాక్‌‌
  •     రష్యా స్టార్​ మెద్వెదెవ్‌‌కు టైటిల్​
  •     రూ. 18 కోట్ల ప్రైజ్‌‌మనీ సొంతం


యూఎస్‌‌ ఓపెన్‌‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌కు ఊహించని విధంగా షాక్‌‌ తగిలింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ ఫైనల్లో సెకండ్‌‌ సీడ్‌‌ డానిల్‌‌ మెద్వెదెవ్‌‌ (రష్యా) 6–4, 6–4, 6–4తో టాప్‌‌సీడ్‌‌ జొకోవిచ్‌‌ (సెర్బియా)ను ఓడించి కెరీర్​లో తొలి టైటిల్‌‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో 1969 తర్వాత కెరీర్‌‌ స్లామ్‌‌ (నాలుగు గ్రాండ్‌‌స్లామ్స్‌‌) సాధించాలనుకున్న జొకో ఆశలు నెరవేరలేదు. ఈ సీజన్‌‌లో ఇప్పటికే అతను ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌, ఫ్రెంచ్‌‌, వింబుల్డన్‌‌ గెలిచాడు. దీంతో యూఎస్‌‌ ఓపెన్‌‌నూ గెలిచి మేజర్‌‌ టైటిల్స్‌‌ సంఖ్యను 21కి పెంచుకోవాలన్న ఆశ కూడా తీరలేదు. 1962, 1969లో నాలుగు మేజర్‌‌ టైటిల్స్‌‌ గెలిచి కెరీర్‌‌ స్లామ్‌‌ సాధించిన రాడ్‌‌ లేవర్‌‌ సాక్షిగా మ్యాచ్‌‌ ఆడిన జొకో.. అతని సరసన నిలవలేకపోయాడు. విమెన్స్‌‌లో స్టెఫీ గ్రాఫ్‌‌ 1988లో ఈ ఫీట్‌‌ను సాధించింది. గతంలో జాక్‌‌ క్రాఫోర్డ్‌‌ (1933), లీ హోడ్‌‌ (1956) మాత్రమే సీజన్‌‌లో వరుసగా మూడు గ్రాండ్‌‌స్లామ్‌‌ గెలిచారు. ఇప్పుడు జొకో వీళ్ల సరసన నిలిచాడు.
 
డానిల్​ ప్రతీకారం..

మేజర్‌‌ ఫైనల్స్‌‌లో 0–2తో వెనుకబడ్డ 25 ఏళ్ల మెద్వెదెవ్‌‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ ఫైనల్లో జొకో చేతిలో ఓడాడు. ఇప్పుడు యూఎస్‌‌ ఓపెన్‌‌ గెలిచి అతనిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. 2 గంటలా 15 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌లో జొకో తన ఫామ్‌‌ను, ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్లను చూపెట్టలేకపోయాడు. 38 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ చేయడంతో పాటు ఆరు బ్రేక్‌‌ పాయింట్లలో ఒక్కదానిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. మ్యాచ్‌‌ మొత్తం ఫ్రస్ట్రేషన్‌‌తో కనిపించిన సెర్బియన్‌‌ ఓటమి తర్వాత రాకెట్‌‌ను పదేపదే నేలకు కొట్టి విరగ్గొట్టాడు. మరోవైపు 6 అడుగుల 6 అంగుళాల పొడవు ఉన్న మెద్వెదెవ్‌‌.. బలమైన సర్వీస్‌‌లు, అద్భుతమైన గ్రౌండ్‌‌ స్ట్రోక్స్‌‌తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌‌ 23 సర్వీస్‌‌ల్లో 20  పాయింట్లు గెలిచాడు. 16 ఏస్‌‌లతో 38 విన్నర్స్‌‌తో మ్యాచ్‌‌ను ఫినిష్‌‌ చేశాడు. జొకో కంటే 11 ఎక్కువగా కొట్టడం విశేషం. మ్యాచ్‌‌ మొత్తంలో యాంగిల్స్‌‌ షాట్స్‌‌ ఎక్కువ కొట్టని మెద్వెదెవ్‌‌.. చాలా షాట్స్‌‌ను మిడిల్‌‌ కోర్టులో హిట్‌‌ అయ్యేలా కొట్టి సక్సెస్‌‌ అయ్యాడు. థర్డ్‌‌ సెట్‌‌లో స్కోరు 5–2 ఉన్న దశలో రష్యన్‌‌ రెండు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేశాడు. చివరకు 5–4 వద్ద కూడా సెకండ్‌‌ మ్యాచ్‌‌ పాయింట్‌‌కు మళ్లీ డబుల్ ఫాల్ట్‌‌ చేశాడు. కానీ తర్వాతి చాన్స్‌‌లో సర్వీస్‌‌ విన్నర్‌‌ను అడ్డుకోలేకపోక మ్యాచ్​ ఓడిన జొకో కన్నీటి పర్యంతమయ్యాడు.

పెండ్లి రోజు భార్యకు పెద్ద గిఫ్ట్​

కెరీర్​లో ఫస్ట్​  గ్రాండ్​స్లామ్​ గెలిచిన డానిల్​ మెద్వెదెవ్​ తన మూడో పెండ్లి రోజున భార్య డారియాకు అతి పెద్ద గిఫ్ట్​ ఇచ్చాడు. టోర్నీలో బిజీగా ఉండి  పెండ్లి రోజు (ఆదివారం) భార్యకు గిఫ్ట్​ కొనే విషయం మర్చిపోయానని, ఈ సమస్యను పరిష్కరించేందుకు 2.5 మిలియన్​ డాలర్ల చెక్​ (యూఎస్​ ఓపెన్​ ప్రైజ్​మనీ రూ. 18 కోట్లు) అందరికీ లభించదని ప్రెజెంటేషన్​ సెర్మనీలో డానిల్​ చెప్పాడు. డారియానే తనకు అది పెద్ద బలమన్నాడు.