
వాల్ మార్ట్ పై విమానాన్ని కూలుస్తానని.. బెదిరిస్తూ అమెరికాలో పైలట్ దాదాపు 3 గంటల పాటు బీభత్సం సృష్టించాడు. మిసిసిప్పి రాష్ట్రంలోని టుపెలో సిటీలో ఈ ఘటన జరిగింది. పైలట్ బెదిరింపులతో పోలీసులు, ఇతర అధికారులు అప్రమత్తమై వాల్ మార్ట్ తో పాటు సమీపంలోని స్టోర్ల నుంచి సిబ్బంది, ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించారు. ఉదయం 5 గంటల సమయంలో టుపెలో ఎయిర్ పోర్టు నుంచి తొమ్మిది సీట్లు ఉండే చిన్న విమానాన్ని పైలట్ తీసుకుపోయాడని... 3 గంటలకు పైగా గాలిలోనే చక్కర్లు కొట్టాడని పోలీసులు తెలిపారు. 8 గంటల తర్వాత పైలట్ విమానాన్ని బ్లూస్ప్రింగ్స్ సిటీ సమీపంలో ల్యాండ్ చేశాడు. వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.