
US Tariffs: అమెరికా తాజాగా మరో కొత్త టారిఫ్స్ యుద్ధానికి తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రష్యాతో వ్యాపారం చేస్తున్న అన్ని దేశాలపై వ్యాపార సుంకాలను వేయాలని చూస్తోంది. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ దేశంపై దండెత్తి మూడేళ్లు గడుస్తోంది. అయితే ఇది జరిగిన తర్వాత కూడా రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న దేశాలపై భారీగా సుంకాలను ప్రకటించాలని అమెరికా చూస్తోంది.
యూఎస్ సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ దీనికి సంబంధించిన కీలక విషయాలను తాజాగా ప్రస్థావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై 500 శాతం సుంకాలను ప్రకటించటానికి తీసుకురావాలని చూస్తున్న బిల్లుకు సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారని అన్నారు. అయితే ఈ సుంకాలు చైనా, భారత్ వంటి దేశాలను భారీగా ప్రభావితం చేయనున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి భారత్ చాలా కాలం నుంచి రష్యా వద్ద చమురు కొనుగోలు చేస్తోంది. అయితే ప్రస్తుత ఆంక్షల ద్వారా మాస్కోతో వ్యాపారాన్ని నిరోధించటం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీసేలా చేస్తుంది.
ఈ చర్యలు పరోక్షంగా యుద్ధంలో ఉన్న రష్యా ఎకానమనీని దెబ్బతీసి పుతిన్ ఉక్రెయిన్ విషయంలో అమెరికా వద్ద చర్చలకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే రష్యా నుంచి వస్తువులు, చమురు, రక్షణ పరికరాలు వంటివి వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్న దేశాలపై అమెరికా 500 శాతం వరకు పన్ను విధించాలని చూస్తోంది. ప్రస్తుతం భారత్, చైనాలు రష్యా చమురు అమ్మకాల్లో 70 శాతం వరకు కొనుగోలు చేస్తుండటంతో అమెరికా కొత్త సుంకం ఆలోచనతో ముందుకొస్తోంది.
రష్యా చేస్తు్న్న యుద్ధాన్ని ఆపటానికి వాణిజ్యం, ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలనే లక్ష్యంతో ప్రస్తుతం కొత్త సుంకాల ఆలోచనతో ముందుకొచ్చినట్లువెల్లడైంది. అయితే ఈ బిల్లును తొలుత మార్చితో తీసుకురావాలని అభిప్రాయపడినప్పటికీ తర్వాత దానిని ఆగస్టుకు మార్చటం జరిగింది. ఒకవేళ ఈ బిల్లు అమలులోకి వస్తే భారత్ కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే పశ్చిమ దేశాలు శాంక్షన్స్ ప్రకటించినప్పటికీ తక్కువ ధరకు అందుబాటులో ఉన్న రష్యన్ ఆయిల్ చైనా, భారత్ వంటి దేశాలు ఎక్కువగా కొంటున్నాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుగా ఉన్న భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎక్కువగా రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే రష్యా మాత్రం సుంకాల ప్రకటనను లైట్ తీసుకుంటోంది. అమెరికా చేయాలనుకుంటే ఇది ఎప్పుడో చేసేదని.. ఈ ఆంక్షలు ఉక్రెయిన్ తో యుద్ధాన్ని నిజంగా ఆపటానికి ఉపయోగపడతాయా అంటూ బదులిచ్చింది. ఇండియా అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో దీని గురించి కూడా చర్చించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.