iPhone News: ఇండియాలో ఐఫోన్స్ తయారీ ఇష్టం లేదన్న ట్రంప్.. ఆపిల్‌కి వార్నింగ్

iPhone News: ఇండియాలో ఐఫోన్స్ తయారీ ఇష్టం లేదన్న ట్రంప్.. ఆపిల్‌కి వార్నింగ్

Trump to TimCook: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మధ్యప్రాశ్చ దేశాల్లో తన పర్యటనను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన దోహాలో జరిగిన సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. 

ఐఫోన్స్ తయారు చేసే ఆపిల్ సంస్థ సీఈవో టిమ్‌కుక్ తో తాను జరిపిన సంభాషణ గురించి వెల్లడించిన ట్రంప్.. ఇండియాలో ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తి విస్తరణకు ఫ్యాక్టరీల ఏర్పాటు తనకు నచ్చలేదని టిమ్ కుక్ కి చెప్పానన్నారు. ఇండియా తన అవసరాలు, ప్రజల గురించి చూసుకోగలదని వెల్లడించినట్లు దోహాలో బాంబు పేల్చారు. రానున్న కాలంలో ఆపిల్ తన ఉత్పత్తిని అమెరికా కేంద్రంగా విస్తరించనున్నట్లు కూడా ఈ సందర్బంగా ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ట్రంప్ మెుదటి నుంచే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ కంపెనీలను అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని చెబుతున్నారు.

వాస్తవానికి చైనాతో పోల్చితే ఇండియాలో ఉత్పత్తి ఖర్చు 5 నుంచి 10 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆపిల్ చైనాపై అమెరికా విధించిన సుంకాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని ఇండియాకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2026 చివరి నాటికి మెజారిటీ ఆపిల్ ఉత్పత్తులను భారత్ కేంద్రంగా చేపట్టాలని చూస్తున్నట్లు గతనెలలో రాయిటర్స్ నివేదించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రతి ఏటా అమెరికాలో దాదాపు ఆపిల్ ఐఫోన్ల సేల్స్ 6 కోట్ల యూనిట్లుగా ఉంది. వాస్తవానికి దీనిలో 80 శాతం ప్రస్తుతం చైనాలో జరుగుతుండగా దీనిని అమెరికాకు తరలించాలని ట్రంప్ చూస్తున్నారు.

Also Read : ట్రంప్ కుటుంబ కంపెనీతో పాకిస్థాన్ డీల్

కానీ ఇప్పటికే ఆపిల్ సంస్థ తన ఇండియా ప్లాంట్లలో ఉత్పత్తిని ట్రంప్ టారిఫ్స్ కారణంగా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో ఏకంగా రూ.17వేల కోట్లు విలువైన 600 టన్నుల బరువైన ఐఫోన్లు ఇండియా నుంచే షిప్పింగ్ చేయబడ్డాయి. రాత్రికి రాత్రే ప్రత్యేక కార్గో విమానాల్లో ఇండియా ఫాస్ట్ క్లియరింగ్ ఇప్పించి మరీ వీటిని అమెరికాకు తరలించి ఆపిల్ సంస్థకు భారీ నష్టాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఇండియాలో ఫాక్స్ కాన్, టాటా సంస్థలు ఆపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. 2024లో ఆపిల్ తన మెుత్తం అమ్మకాల్లో 18-20 శాతం అంటే 4 నుంచి 4.5 కోట్ల ఐఫోన్లను భారతదేశంలోనే తయారు చేయటం గమనార్హం. 

ప్రస్తుతం అమెరికా సుంకాల నేపథ్యంలో ఐఫోన్లు, ఇతర ఆపిల్ ఉత్పత్తులను ఇండియాతో పాటు వియత్నాం నుంచి తెప్పిస్తోందని ఈనెల ప్రారంభంలో ఆర్థిక ఫలితాల ప్రకటన సమయంలో టిమ్ కుక్ ఇన్వెస్టర్లకు వెల్లడించారు. అమెరికా బయట ఇతర దేశాల్లో విక్రయించే ఆపిల్ ఉత్పత్తులు మాత్రం చైనా నుంచి షిప్పింగ్ చేయబడతాయని ఆయన వెల్లడించారు. దీంతో అమెరికాలో అమ్ముడవుతున్న ఐఫోన్లు, మ్యాక్స్, ఆపిల్ వాచ్ లు, ఐపాడ్స్ కేవలం ఇండియా, వియత్నాం నుంచే ప్రస్తుతం సరఫరా అవుతున్నట్లు కుక్ పేర్కొన్నారు.